CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 80

ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి

prabhuni raakada ee diname parugulidi

ఆమోసు 4: 12 "మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి"

More
పల్లవి:ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే (2)
చరణం 1:సిద్ధులగువారిన్ - మనయేసు - శుద్ధిజేయునిలన్ - పరమునకై (2) బుద్ధిహీనులను శ్రమల చేత (1)- బద్ధులుగ జేయున్ - వేదనతో బాధ కలిగించున్ - సాతాను (2)
చరణం 2:స్వరముతో వచ్చున్ - అధికారి - మహిమతో మరలున్ తనదూత - సూర్యచంద్రునిలన్ తారలతో జీకటుల్ క్రమ్మున్ ప్రభురాక - పగలు రాత్రియగున్ - త్వరపడుము
చరణం 3:మొదట లేతురు సజీవులై - ప్రభుని యందుండు - ఆ మృతులు మరల అందరము ఆ ధ్వనితో - పరము జేరుదుము ధర నుండి ధన్యులగుడుము - పరికించు
చరణం 4:వెయ్యియేండ్లు పా - లించెదరు ప్రియుని రాజ్యమున ఆ ప్రియులు, సాయంసమయమున - చేరి - నెమలి కోకిలలు ఆ రాజున్ - పాడి స్తుతించును ఆ దినము
చరణం 5:గొఱ్ఱెమేకలును - ఆ చిఱుత సింహజాతులును ఒకచోటన్ భేదము లేక బరుండి గరిక మేయును - ఆ వేళ కలసి మెలగును - భయపడక
చరణం 6:న్యాయనీతులన్ - మన ప్రభువు ఖాయముగ దెల్పున్ ఆనాడు - సాక్షులుగ నిలుతుం అందరము - స్వామియేసునకు ధ్వజమెత్తి చాటి యేసునకు - ఓ ప్రియుడా