CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 85

దేవుడు మీకు ఎల్లప్పుడు - దేవుడు మనకు ఎల్లప్పుడు

devudu meeku ellappudu - devudu manaku ellappudu

జెకర్యా 8:23 "దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది"

More
పల్లవి:దేవుడు మీకు ఎల్లప్పుడు - దేవుడు మనకు ఎల్లప్పుడుతోడుగ నున్నాడు    ..........3 సార్లు
చరణం 1:ఏదేనులో ఆదాముతో నుండెన్ - హానోకు తోడనేగేను దీర్ఘదర్శకులతో నుండెన్ (2) ధన్యులు దేవుని గలవారు (2) – తోడుగనున్నాడు (1)
చరణం 2:దైవాజ్ఞను శిరసావహించి - దివ్యముగ నాబ్రాహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గము నెత్తిన యపుడు –తోడుగనున్నాడు
చరణం 3:యోసేపు ద్వేషించ బడినపుడు - గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెఱసాలయందు సింహాసనమెక్కినయపుడు –తోడుగనున్నాడు
చరణం 4:ఎర్రసముద్రపు తీరము నందు - ఫరోతరిమిన దినమందు యోర్దాను దాటిన దినమందు యెరికో కూలిన దినమందు -తోడుగనున్నాడు
చరణం 5:దావీదు సింహము నెదిరించి - ధైర్యాన చీల్చినయపుడు గొల్యాతును హతమార్చినయపుడు సౌలుచే తరుమబడినపుడు –తోడుగనున్నాడు
చరణం 6:సింహపు బోనులో దానియేలు - షద్రకు మేషా కబేద్నెగో అగ్ని గుండములో వేయబడెన్ నల్గురిగా కనబడినపుడు –తోడుగనున్నాడు
చరణం 7:పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు అపొస్తలులు విశ్వాసులు హింసించబడినయపుడు-తోడుగనున్నాడు