పల్లవి:నష్టము నంతటిని మరల- మా యేసునిలో ఆర్జించితిమి (1)ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయ పాడెదము
చరణం 1:ఆనందించెదము - ప్రభు యేసులో - అంతయు మరలా ఆర్జించుకొంటిమి
ఆదాము నుండి పోయిన దెల్లయు - అనుభవించు చున్నామిప్పుడు
చరణం 2:దావీదు వలె అంత నష్టపడితిమి - దుఃఖపడి బహుగా ఏడ్చితిమి
దావీదువలె ప్రభుని వెదకగ - తిరిగి ఆర్జించుకొంటిమి || నష్టము ||
చరణం 3:పూర్వము నైక్యము లేకపోయెను - పేదలమైయుంటిమి అప్పుడు
మనలను ఖాళీ చేసికొనగా - మరల నొందితిమి పూర్ణత || నష్టము ||
చరణం 4:మొదటి ప్రేమనుకోల్పోతిమిల - వ్యర్థమైనట్టిప్రేమనొందితిమి
పొందితిమి యేసుప్రభువులో - నిండుగను దైవప్రేమను || నష్టము ||
చరణం 5:దేవునికల్గియుండకుంటిమి - దైవసమాధాన మొందకుంటిమి
పాపములలో మరణించియుంటిమి - పరమజీవ మొందితిమి || నష్టము ||
చరణం 6:నిరీక్షణయేమిలేక యుంటిమి - నరకమున కర్హులమైయుంటిమి
ఘనుడగు యేసునంగీకరింపగా - నన్నును విమోచించెను || నష్టము ||
చరణం 7:పాపము వలనెంతో నష్టపోతిమి - ప్రభులో సకలము సంపాదించితిమి
శాపము నందు చుట్టబడతిమి - సర్వమొందెదము మరల || నష్టము ||