CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 90

బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింప

balavantudesu mahima - paadi veelagune vivarimpa

యెషయా 12 : 3 "రక్షణ బావులు"

More
పల్లవి:హా! రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి (1) ఎండిపోవు ఎన్నడైనను చేదికొందు మెన్నడందున (2)
చరణం 1:బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింప (1) కల్వరి రక్షణ విలువ ఎల్లరికిని దొరుకును (1)
చరణం 2:నీళ్ళు లేని శ్రమ యెంతయో - దీని నాలోచించరే యెవ్వరు విలువైన ప్రభుని మాటలన్ ఆలకించి యంగీకరించు ॥ హా! ॥
చరణం 3:ఉప్పు నీళ్ళ బావులున్నను - ఇక ఉపయోగమే యుండదు తప్పులన్ని త్రోసివేయుము - అప్పుడే యానందమబ్బును ॥ హా! ॥
చరణం 4:కలహముల మానివేతుము - మంచి జలముల త్రాగి యానందింతుము ఎల్లర మేకమౌదము - తొలగద్రోసి యడ్డులన్నియు ॥ హా! ॥
చరణం 5:జీవజలముల త్రాగినవారు - మీరు దేవుని సాక్షులై యుండుడి భువి నెందరో దప్పిగొన్నారు - త్రోవ జూపుడి వారికి ॥ హా! ॥