పల్లవి:భక్తుల సంఘమే - ప్రభుని శరీరము (1)అందాయన తన - పూర్ణత నింపును (2)
చరణం 1:ఒక్క శరీరమునకు - శిరస్సు నొకటేగా (2)
సంగమునకు ప్రభు - వే శిరస్సుగా (2)
చరణం 2:శిరస్సు నుండే యోచనలు వెలువడును
శరీరము నందు - ప్రకటింపబడున్
చరణం 3:యూదులని హెల్లే - నీయులనియు లేదు
దాసులనియు స్వతం - త్రులనియు లేదు
చరణం 4:కలవు శరీరములో - అనేకావయవముల్
కలసి ఏకముగా - నివసించుచుండున్
చరణం 5:కరములు కాళ్లతో - కలహించలేవు
కలయకనే కార్య-మును - చేయలేవు
చరణం 6:ఆత్మైక్యత నను - యవములు కలిగిన
క్షేమాభివృద్ధిని - దేహము బొందున్
చరణం 7:శిరస్సాధీనములో - సర్వాంగములుండిన
సేవలో ప్రభు పరి-పూర్ణత యుండును