CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 94

నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా

nee devuni sannidhini - kanabadanu neevu siddhapadumaa

అమోసు 4: 12 "మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి"

More
పల్లవి:నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా (1)
చరణం 1:నీ యౌవనములో - నీ హృదయమును - సంతృప్తిగా - నుండనిమ్ము (2) ఆయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి - తెచ్చు నిన్ను (2)
చరణం 2:దుర్దినంబులు రాకముందే - వాటిలో సంతోషము లేదని చెప్పుసమయము రాకమునుపే సృష్టికర్తను స్మరియించుమా
చరణం 3:నీ యౌవన జీవితమును బట్టి - తృణీకారము నొందకుమా ప్రభువును బోలి నడచుకొనుమా మాదిరి కరముగా జీవించుమా
చరణం 4:వినయ విధేయత కలిగి యుండి - ఒకరి నొకరు యోగ్యులుగా మన్నన చేయుచు పరుల కార్యముల స్వకార్యముల వలె భావించుమా
చరణం 5:ప్రేమ సంతోష - సమాధానము దీర్ఘ శాంత దయాళుత్వము మంచితనము సాత్వీక విశ్వాసము కలిగి యుండి జీవించుమా
చరణం 6:మేలు చేయుట యందు నీవు - విసుగక యుండుము యెల్లప్పుడు సహనముతో ప్రభు సేవ చేసిన ఫలము ననుభవించెదవు
చరణం 7:హల్లెలూయ పాటలు పాడుచు - ఎల్లప్పుడు ప్రభు రాకడకై ఉల్లము నందు సంతసించుచు పాడుము ప్రభునకు హల్లెలూయ