పల్లవి:క్రీస్తు యేసు ప్రభుని - శరీరమే సంఘం (1) మీరు దానిలో వేరు వేరు - అంగములై యున్నారు (2)
చరణం 1:చీకటిలో నున్న మిమ్ములను తన - ఆశ్చర్యమైన వెలుగులోనికి (2)
మిమ్మును పిలిచిన యేసుప్రభుని
గుణాతిశయములు ప్రచురించుడి (1)
చరణం 2:రాజులైన యాజక సమూహమును-దేవుని సొత్తైన ప్రజలైయున్నారు
ఆత్మకు విరోధమై యుండె - శరీరాశలను విసర్జించుడి
చరణం 3:దేవునికి అనుకూలముగా- ఆత్మీయ బలులర్పించుటకై
పరిశుద్ధ యాజకులుగా యుండునట్లు
సజీవ రాళ్ళమై యున్నాము
చరణం 4:దేవుడు పరిశుద్ధుడు గనుక - మీరు పరిశుద్ధులై యుండుడి
వ్యర్థ ప్రవర్తనను విడనాడి- నిందా రహితులై జీవించుడి
చరణం 5:ఏకముగను కలిసి వసించును - శరీరములోని అంగములు
శిరస్సైన ప్రభునకు లోబడియుండి
కలిసి యుండుడి ప్రేమలో