CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 98

యేసు ప్రభు నీ ముఖ

yesu prabhu nee mukha

యోహాను 6 : 35 “జీవాహారము నేనే... నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.”

More
పల్లవి:యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే (1)  నా ప్రతి యాశను తీర్చుకొందును (2)
చరణం 1:నీవే నాకు జీవాహారము (2) - నిన్ను సమీపించువారే మాత్రము (2) ఆకలి గొనరిల ఆదర్శుడవు (2)
చరణం 2:నీ మందిర సమృద్ధి వలన నా - మది నెప్పుడు తృప్తిపొందితిని ఆనంద జలమును త్రాగించుచున్నావు
చరణం 3:నీవే నాకు జీవపు మార్గము - నీ సన్నిధిని పూర్ణానందము కలదని నిన్ను ఘనపరచెదను
చరణం 4:ఆశతో నిండిన నా ప్రాణమును - ఆకలిగొనిన నాదు ఆత్మను మేలుతో నీవు తృప్తిపరచితివి
చరణం 5:నీ సంతోషము నా కొసగితివి -నా సంతోషము పరిపూర్ణముగా కావలయునని కోరిన ప్రభువా
చరణం 6:నా జీవిత కాలమంతయును - నీ ఆలయములో నివసించుచు హల్లెలూయ పాటను పాడెద ప్రభువా