CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 104

నా ప్రాణ ప్రియుడా యేసురాజా

naa praana priyudaa yesuraajaa

Isaiah 9:6

More
పల్లవి:నా ప్రాణ ప్రియుడా యేసురాజా- అర్పింతును నా హృదయార్పణ (1)విరిగి నలిగిన ఆత్మతోను - హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా (1)
1. అధ్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా (2) బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమరాజా – స్తుతించెదన్(1)
2. విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా
3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువవు విడివవు ఎడబాయవు - కరుణారాజా
4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహారమున్ రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును
5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతా స్తుతుల తోడ నీ ప్రేమను నే వివరింతును - విమోచకుడా
6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu