CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 105

దేవదేవుని కొనియాడెదము

devadevuni koniyaadedamu

Psalms 136:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవదేవుని కొనియాడెదము - అవిరత త్రియేకుని స్తోత్రింతుము (1)
అను పల్లవి:ఏపుగా దయాళుని పొగడెదము - పాప పరిహారుని పాడెదము (1) || దేవ ||
1. దూతలు స్తుతించు మహోన్నతుడు - కన్య మరియ యందు జన్మించెను (1) మహియందు చీకటి పోగొట్టి - ఇహపర సుఖముల దయచేసెను (1)
2. పాపశాపమును తీర్చను - పాట్లు పడెను దేవ గొఱ్ఱె పిల్ల హా! మంచి గొఱ్ఱెల బోయడే - ప్రాణము నిచ్చెను మనకై
3. పాపముల కడిగి రక్షించెను - కృపనిచ్చె వేచియుండుటకై వైరిని జయింపను శక్తినిచ్చెను - నరులకు భాగ్యము నందించెను
4. ఆకాశము నుండి దిగి వచ్చును - లోకమున్ న్యాయము తీర్చుట ఆయత్తముగ కాచియుండెదము - పాయక వివేక కన్యల వలె
5. తన స్వరూపము నే దాల్చను - ఆయనే నా రూపము దాల్చెన్ దాసుడనగు నన్ను రక్షింపన్ - యేసు నరరూపము దాల్చెన్
6. పాతాళ లోకము కూల్చవచ్చెన్ - జాతి యడ్డుగోడ పడగొట్టెను నిత్య జీవంబు నియ్యను వచ్చెను - నీతి సూర్యుడు ప్రభు యేసువే
7. హల్లెలూయ పాడి ఆర్భటింతుము - హర్షముతో యేసున్ చాటెదము బలుడైన తండ్రిని కీర్తింతుము - విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము

Back to Hebron Seeyonu Geethalu