1. రాజాధి రాజుపై కిరీటముంచుడి పైలోకానంద సునాదంబుల నాలించుడి లే లెమ్ము డెందమా! నా కై చావొందిన రారాజుపై కిరీటముంచి రాజున్ జేయుడి
2. ఈ ప్రేమ రాజుపై - కిరీటముంచుడి ప్రకాశించు, ప్రక్కచేతి - గాయంబుల్ చూడుడి ఏదూత చూచును - భరింప గల్గును నా వైపు వంగి చూచుచు - న్న - రాజున్ గొల్వుడి
3. ఈ జీవ రాజుపై - కిరీటముంచుడి చావున్ జయించినన్ - రక్షించిన సజీవియై చావున్ జయించెను - జీవంబుదెచ్చెను హా! చావున్ గెల్చి - జీవకి - రీటంబు దెచ్చెను
4. ఈ మోక్షరాజుపై కిరీటముంచుడి - నిత్యుండై తండ్రితోన్ - శుద్ధాత్మతోడ నైక్యుండు రవంబు చేయుడి నిరంతరంబును - ఓ రాజా, నీకే నిత్యఘ - నత ఖ్యాతి గల్గును