CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 182

ప్రవిమలుడా పావనుడా స్తుతిస్తోత్రము నీకే

pravimaludaa paavanudaa stutistotramu neeke

Romans 5:5

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రవిమలుడా పావనుడా - స్తుతిస్తోత్రము నీకే (2)పరమునుండి ప్రవహించె - మాపై కృప వెంబడి కృపలు (1)
1. నీ మందిర సమృద్ధివలన - తృప్తిపరచు చున్నావుగా (2) ఆనంద ప్రవాహ జలమును (2) - మాకు త్రాగనిచ్చితివి (1) కొనియాడెదము నీ కృపకై - ఆనందించుచు పాడెదము (2)
2. దేవుని సంపూర్ణతలో మమ్ము - పరిశుద్ధులుగా జేసియున్నావు జ్ఞానమునకు మించిన ప్రేమ - మాలో బయలు పరచితివి కృతజ్ఞతలు చెల్లించుచు - పూజించెదము నిన్నెప్పుడు
3. దైవత్వము నిండి యుండెనుగా - క్రీస్తు యేసు ప్రభువునందు ఆయనయందు సంపూర్ణులుగా - మమ్ము జేసియున్నావు సాగిలపడుచు నీ కృపకై - ఆరాధింతుము నిన్నిలలో
4. నిర్ధోషులుగా నిరపరాధులుగా - నీ రక్తముతో మము జేసితివి సర్వసంపూత్ణత మాకిచ్చి - సిలువలో సంధిజేసితివి నిత్యము నిన్ను స్తుతించి - ఘనపరచెదము నిన్నిలలో
5. కృపా సత్యసంపూర్ణుడవై - మామధ్యలో నివసించితివి లోకమునందు నమ్మబడితివి - అద్వితీయ తనయుడవై నిరతము నిన్ను కీర్తించి - సమాజములో పాడెదము

Back to Hebron Seeyonu Geethalu