పల్లవి:ప్రేమామృత ధారల చిందిన మన - యేసుకు సమమెవరు? (2)ప్రేమయే తానై నిలచి - ప్రేమోక్తులనే పల్కి (2)ప్రేమతో ప్రాణముబెట్టి (2)- ప్రేమగరికి చనియె (2)
1. నిశ్చలమైన ప్రేమ జీవికి - ఇలలో తావేది ప్రేమద్రోహులేగాని - ప్రియమున జేరరు వాని చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా
2. ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించును రారా పాపభారముతో రారా - పాదములపై బడరా పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు
3. ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెద వేల రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము