CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 545

నీకు కలిగిన దానిని చేపట్టుము

neeku kaligina daanini chepattumu

Revelation 3:11

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీకు కలిగిన దానిని - చేపట్టుముజారవిడచెదవేమో - జాగ్రత్తపడు (2)
1. పరమునకు విజయోత్సవముతో - మనము వెళ్ళెదము (2) పూర్ణ ఫలమును సంతసములో - మనము పొందెదము (2)
2. క్రీస్తు యేసుని స్వీకరించి - ప్రభులో నడచెదము వేరుపారి స్థిరతనొంది - విస్తరించెదము
3. లోక ఇచ్చలనన్ని మనము - విడచి పెట్టెదము ప్రభుని చిత్తము నెరిగి లోబడి - నిలిచియుండెదము
4. ఓపికతో పందెములో మనము - పాలు పొందెదము యేసువైపే దృష్టియుంచి - సాగి పోయెదము
5. చింతలన్నియు ప్రభుని మీదే - మనము వేసెదము ఆయనే నిరతంబు మనపై - చింతగలవాడు
6. బహు శీఘ్రముగా శ్రీ యేసు - మరల వచ్చును మనకు కలిగిన నిరీక్షణను - విడువ కుండెదము

Back to Hebron Seeyonu Geethalu