CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 546

యెహోవాయే మనదేవుడు మార్పులేనివాడు

yehovaaye manadevudu maarpulenivaadu

Hebrews 13:8

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవాయే మనదేవుడు - మార్పులేనివాడు (2)నిన్న నేడు నిరంతరము - ఒకే రీతిగా ఉన్నాడు (2)
1. పాపశాపముల బాప - మానవ రూపి ఆయెను అద్భుత ప్రేమ జూపి - మనలను తానె రక్షించెను
2. తన రెక్కలతో కప్పి - ఆశ్రయమిచ్చును ఆయనె స్వరక్త మిచ్చి కొన్న - తన సంఘమును కాయును
3. క్రుంగిన వేళలందు - అభయమునిచ్చె దేవుడు తన హస్తముతో నిలిపి - అంతమువరకు ఆదుకొనున్
4. శాశ్వత ప్రేమ జూపి - శ్రమలలో విజయ మిచ్చును విశ్వమంతయు మారిన - ఎన్నడుమారడు మనయేసు
5. సంఘముగా చేరి - యెహోవాకే మొర్ర పెట్టెదము ఆపత్కాలము నందు - ఉత్తరమిచ్చును ఆయనె

Back to Hebron Seeyonu Geethalu