పల్లవి:తన రాజ్యమునకు మహిమకు పిలచిన - (2)మన ప్రభువుకు తగినట్టు నడిచెదము - తన రాజ్యములో మనము చేరెదము
1. కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము (2) మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము (2)
2. ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును
3. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును
4. దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు
5. విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము