పల్లవి:ప్రభువుకు తగినట్టు - నడుచుకొందము రండితన్ రాజ్య మహిమకును - తగినట్టు నడుచుకొందము రండి
1. ఆదాము దేవుని, నిబంధనను మీరి - దారి తప్పిపోయెను (2) హానోకు దేవునితో కూడ నడువగా (2) తనతో నతనిని కొనిపోయెను
2. నోవహు దేవునితో కూడ నడిచె - కృప పొందినవాడై తనతరములో నీతిమంతునిగా నెంచి జలప్రళయమునుండి కాపాడెను
3. అబ్రాము దేవుని సన్నిధిలో నడిచె - నిందారహితునిగా దేవుడతనితో, నిబంధనను చేసి తన స్నేహితుడని ప్రకటించెను
4. దేవుని యింటి దర్శనము పొంది - ప్రజలను నడిపించెను మోషే దేవుని యింటిలో నమ్మకమైన వాడని ప్రభువే పలికెనుగా
5. దేవుని కట్టడల ననుసరించి - నడుచుకొనెను దావీదు స్థిరపరచెనాతని సింహాసనమును తన చిత్తానుసారుడని పలికెన్
6. పేతురు , యాకోబు , యోహానులు - ప్రభువును వెంబడించిరి పరలోక సంఘ దర్శనమిచ్చి మనుజులను పట్టువారిగా చేసెన్
7. పునరుర్ధానుడైన ప్రభువును గనక - ఎమ్మాయి కెళ్లిరి శిష్యులు యేసే వారితో కూడా నడిచెను గద్దించి వారి కళ్ళు తెరిపించెను
8. వస్త్రములు అపవిత్రపరచుకొనని - కొందరుండిరి సార్దీసులో అర్హులై తెల్లని వస్త్రము ధరించి సంచరింతురు ప్రభుతో
9. యేసుని వెలుగులో నడుచుకొందము రండి - జీవముగల దేవుని సంఘమా మన అతిక్రమములను ఒప్పుకొనెదము యేసుతో కలిసి కొనసాగేదం