CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 549

సమాధానము దేవుని సమాధానము

samaadhaanamu devuni samaadhaanamu

Luke 2:14

More
Reference recording on YouTube ↗
పల్లవి:సమాధానము - దేవుని సమాధానము (2)ఇష్టులైన మనుష్యులకు సమాధానముదేవుని కిష్టులైన మనుష్యులకు సమాధానము - (1)
1. దయగలదేవుడు - ఈ భువి - కరుదెంచెను ప్రాణమిచ్చె సిలువలో - నిన్ను ప్రేమించి (2) ఈ ప్రేమను ఎరిగి - నీవు విరిగిపోతే - సమాధానము - (2)
2. దుష్టులకు నెమ్మది - లేదనెను దేవుడు శాంతి మార్గమును - వారెరుగరనెను మారు మనస్సు పొందితే - వారికి దొరుకు - సమాధానము
3. ఒప్పుకొనుము నీ పాపము - యేసుని యొద్ద క్షమియించి - పరిశుద్ధునిగా చేయును అప్పుడు నీ ఆత్మలో పొందెదవు - సమాధానము
4. ఆయన ఉపదేశము - నవలంబించుము హృదయములో - నుంచుకొనుము ఆ మాటలను ఆయనతో సహవాసము - చేసిన యెడల - సమాధానము
5. చింతించవలదు - ఏ - విషయమందును తెలియజేయుడి - దేవునికి విన్నపములతో తలంపు హృదయములకు - కావలియుండును - సమాధానము
6. నిన్నాశీర్వదించి కాపాడు - దేవుడు ప్రకాశింపజేయును - తన కృపాసన్నిధి నిన్నాశీర్వదించి -యిచ్చు తన నామమున - సమాధానము

Back to Hebron Seeyonu Geethalu