పల్లవి:యెహోవా విమోచించిన వారె - పాటలు పాడుచుసీయోనునకు తిరిగి వత్తురు - నిత్యానందము కలిగిన వారై
1. ప్రభువైన యసు భూలోకమున - మహారాజై ఏలగ రాగ నిత్యానందముతో విజయసూచనతో - మనస్సున దుఃఖము నిట్టూర్పును లేక
2. అరణ్యమును ఎండిన భూమియు - విరియబూయు నుల్లాసముతో ఘనడై యెహోవా మహిమను గాంచు - ప్రభుక్రీస్తుని ప్రభావమును
3. గ్రుడ్డికి కన్నులు చెవిటికి చెవులు - కుంటిని గెంతెడి దుప్పిగా జేయ సుందరుడైన రాజున్ డెందమున గాంచి - మూగవాని నాలుక పాడి హర్షింప
4. పయనింతురు వారు రాజ మార్గమున - అపవిత్రులు పోజాలరందున ఉండదచ్చోట ఏ మృగ రాజును - పరిశుద్ధ దారిలో పరమగీతముతో
5. భయపడవలదని అభయంబిచ్చి - వారిని రక్షింప వేగమేరాగా ప్రతిదండన జేయు ప్రభువును జూచి - దిగులుతో జనులు వణకుచుండ
6. నిత్యము దహించు అగ్నిజ్వాలలలో - నుండగజాలినవారు ఎవరు? వేషదారులకు బీతిగనుండ పాపిగా - నుండిన నిలుతువెచ్చట
7. నీతిని బూని యదార్ధముగా - వీడిన పాపలాభమును నిత్యము నిలుచు సీయోను పురికి - ముదమున జేరి స్తుతింతువు
8. ఉన్నత పర్వత శిలలే వానికి - బలమైన మహాకోటగ కాగా కొదువేనుండదు తన ఆహారమును - పానమునకు హల్లేలూయ