పల్లవి:దేవుడెహోవా దీవించి ఆశీర్వాదించెనుగా (2)కొదువేమి లేకుండా చేతిపను - లన్నిటిలో నిమ్ము (1)
1. గొప్ప అరణ్యములో నీ నడకలను, తిరుగుటను ప్రభువెరుగు (2) నలువది వత్సరములు యెహోవా మీతో నడిచెను (2)
2. పూర్వమున్నట్లుగా చేసెదమిమ్ము - నా నివాస స్థలముగాను పరిపూర్ణముగా మేలులనేకము చేసెద మీమధ్య
3. మీమీద మనుష్యులను పశువులను విస్తరింప చేసెదను అప్పుడు యెహోవా నేనని మీరు తెలిసికొందురు
4. కష్ట కాలములో సమకూర్చి యుంటిని సమృద్ధి పరికరముల్ మందిర పనికై నీవును బహుగా విస్తరింప చేయుము
5. లెక్కింపలేనంత బంగారు, వెండియు, ఇత్తడి, ఇనుము నాకుండ కాబట్టి నీవు పని పూనుకొనుము యెహోవా తోడై యుండ