పల్లవి :యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు 2మేలుతో నీహృదయమును - తృప్తిపరచుచున్నాడు 2
1. దేవా నీదు కృపతో - నన్ను కరుణింపుము 2నీ వాత్సల్యముతో నా - గత పతనంబుల క్షమియించు 2 || యె ||
2. ఆకాశమున నుండి కలిగిన - దర్శనమునకు నే నవిధేయుడను కాను - నా దేవా జూపుము కృపను || యె ||
3. బాధించు శత్రువు నన్ను - బలముగ బాధించినను నే ధైర్యము విడువను - నను బలపరచుము నీలోన || యె ||
4. ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండెద నిలలో పావనమగు నీ యాత్మన్ - ప్రాపుగ నొసగుము నీదయతో || యె ||
5. ప్రభుయేసు నామమిలలో - ప్రాకటముగ నే బ్రకటింతు ప్రత్యక్షముగ నీ శక్తిన్ - ప్రసాదించుము నాకిలలో || యె ||
6. నీయందు నేను నిలిచి - నిత్యము నే ఫలియింతున్ సత్యాత్ముడా నాకిమ్ము - నిత్యముగను నీ జీవం || యె ||
7. ఆత్మాగ్ని చేత దేవా - అజ్ఞానుండగు నను నింపు నీ జ్ఞానము నాకిమ్ము - సుజ్ఞానుండా హల్లెలూయా || యె ||