1. మహిమతో నిండిన మా రాజా - మహిమతో తిరిగి వచ్చువాడా (1) శరీరమును దాని క్రియలెల్లను - ఆశతో వాక్యముచే - తొలగించుము (1) తొలగించుము వచ్చి తొలగించుము - ఆశతో వాక్యముచే - తొలగించుము (1)
2. ఆకస ఆసనమును వీడి - లోకమునుజూడ వచ్చితివి ఇంపుగ వాసము చేయుటకు - సొంపుగ లోన - ప్రవేశింపుము ప్రవేశింపుము ప్రవేశింపుము - సొంపుగ లోన - ప్రవేశింపుము
3. గుడారమున వసియించితివి - తోడ నిలచితివి మేఘమువలె కొఱతలేక జనుల నడిపితివి - వాక్య ప్రకారము - కోరి రమ్ము కోరి రమ్ము నేడు కోరి రమ్ము - వాక్య ప్రకారము - కోరి రమ్ము
4. ఇశ్రాయేలీయులతో నేగితివి - ఎజ్రాతోడనే యుంటివి సొలొమోను గుడిలో వసియించితివి - కాలమెల్ల మాతో - నుండుము నుండుము మాతో నుండుము - కాలమెల్ల మాతో - నుండుము
5. గిరిపైన చూపిన మాదిరిని - మరువక సొంపుగ చేసితివి అక్కరగా మనము లోబడిన - చక్కగా మనలను పాలించును పాలించును యేసు పాలించును - చక్కగా మనలను పాలించును
6. భూమ్యాకాశములు పట్టని - వ్యోమపీఠుడు భువికి వచ్చెన్ నీతితో రాజ్యము నేలుటకు - జ్యోతితోడ లోన - వచ్చునేసు వచ్చునేసు నేడు వచ్చునేసు - జ్యోతితోడ లోన వచ్చునేసు
7. హల్లెలూయ పాట చాటింపన్ - ఆశతో నిన్నాహ్వానింపన్ ఫలము లనేకము లర్పించన్ - ఎల్లరిలోన - ప్రవేశించుము ప్రవేశించుము ప్రవేశించుము - ఎల్లరిలోన - ప్రవేశించుము