CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 691

నిన్ను విడువను నేను

ninnu viduvanu nenu

Acts 18:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:నిన్ను విడువను నేను - అందరు నిన్ను విడచినను -నిన్ను ఎన్నడు ఎడబాయను నేను - నిన్ను (1)
1. యేసుని పొలములో పనిచేసెడి (2) - దాసులందరికిదే వాగ్దానము (2) ఆత్మల పంట కోయునపుడు (2) - మీతో నుందును నేను (1)
2. దుష్టుడు నిరుత్సాహ పరచును - కష్టపడినను ఫలితము లేదని యిష్టముగా పనిచేయుము నీవు - శ్రేష్ఠుడొసగును జయము
3. కాయమునందు విత్తిన నీవు - క్షయమను పంటను కోతువు ఆత్మీయముగా విత్తిన కోతువు - నిత్య జీవపు పంట
4. మానవులను లెక్కించకుము - ప్రాణుల ప్రభుకై సంపాదింప నిను కృంగఁజేయు నిష్మాయేలెప్పుడు - కనుమిస్సాకులో జయము
5. మనకు మాదిరి క్రీస్తునుంచెను - తన స్వరూపమునకు మారునట్లు మనము ప్రభుని పోలునట్లు - ఆత్మ చేయున్ మనలన్
6. మనదు స్వార్థము పోవునట్లు - ఆయనతో శ్రమపడుటయే మార్గము క్రీస్తు స్వరూపమేర్పడు మనలో - అగ్నిపరీక్ష యందు
7. జలములలో దాటునపుడు - జ్వాలలందు నడచునపుడు బలముగా మీకుతోడై యుండి - నిలిపెదను నా దృష్టి

Back to Hebron Seeyonu Geethalu