CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 692

సర్వోన్న తుడు సర్వాధికారి

sarvonna tudu sarvaadhikaari

Romans 8:28

More
Reference recording on YouTube ↗
పల్లవి:సర్వోన్న - తుడు సర్వాధికారి - సర్వశక్తిమంతుడు - ఆయనే -సర్వజ్ఞా - నము మనకు - నిచ్చున్ పాడుడల్లెలూయ (2)
అను పల్లవి:యధార్థమైనది - దైవమార్గ మిల - సంపూర్ణమైనది -నాథుడేసు నీకై చేయుచున్నది - ఇప్పుడు నీకు తెలియదు -మననాథు డమర్త్యుని మాటనమ్ము - మిక - మీదట తెలిసి కొందువు (1)
1. ఆశ్చర్యకరుడు యోసేపున్ నెట్టి - తెచ్చె నైగుప్తునకు - రాజుగా - చేసి తన ప్రజల అక్కరన్ తీర్చె - పాడు డల్లెలూయ (2)
2. ఆలోచనకర్త మోషేను లేపె - పాలకుడైన ఫరో నెదిరింపన్ - బలపరచి తన ప్రజలన్ విడిపించె - పాడు డల్లెలూయ
3. మహోన్నతుడు దానియేలున్ గాచె - మహాబాబెలునందు ఆయనే - మహారాజుగా మహిమ నొందెను - పాడు డల్లెలూయ
4. బలవంతుడేసు పేతురున్ గాచి - పౌలును బట్టి తెచ్చి - సంఘమున్ - కల్తీలేకుండ కట్టె సత్యాత్మతో - పాడు డల్లెలూయ
5. ఆది అంతము లేని మన యేసు - నాథుడు వచ్చుచున్నా డిదిగో - సిద్ధముగా నుండి సుస్వాగత మిమ్ము - ఆమెన్ హల్లెలూయా

Back to Hebron Seeyonu Geethalu