CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 768

ఆత్మ నియమము ద్వారా సాగి పోవుదము

aatma niyamamu dvaaraa saagi povudamu

Hebrews 12:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆత్మ నియమము ద్వారా - సాగి పోవుదము - విశ్వాసమునకు కర్తయు దానినికొనసాగించు యేసుని జూచుచు - ఓపికతో మనము సాగి పోవుదము
1. భక్తి హీనులకు నీతిని జాటుచు - జల ప్రళయమున ఓడలో జేరిన - నోవహువలె మనము సాగి పోవుదము
2. సిద్ధపరచిన పురమును - జేర వాగ్దానములను నమ్మి నడిచిన అబ్రహాము వలె - సాగి పోవుదము
3. ఘోరమైనయా జారత్వమునకు - దూరముగాను పారిపోయిన - యోసేపును బోలి సాగిపోవుదము
4. దేవుని ప్రజలతో శ్రమయే మేలని - ఐగుప్తు పాపపు భోగము విడిచిన మోషేవలె మనము సాగి పోవుదము
5. పరిశుద్ధాత్మతో నిండిన వాడై - దైర్యముగా వాక్యమును బోధించిన - పేతురు వలె మనము సాగి పోవుదము
6. పోరు సహించి సువార్త పక్షమున - పరుగు ముగించి పానార్పణమైన - భక్త పౌలు వలే సాగి పోవుదము
7. తేటగ దైవ సంకల్పము దెల్పుచు - రాళ్ళను రువ్వగ ప్రాణము విడిచిన - స్తెఫను వలె మనము సాగిపోవుదము

Back to Hebron Seeyonu Geethalu