పల్లవి:నీదు విశ్వాస్యత మా ప్రభు యేసుఅంతరిక్షము నధిగమించెను (2)
చరణం 1:నిను ప్రేమించి నీ ఆజ్ఞలను - అనుసరించు మనుజావళికి (2)
నిబంధనను స్థిరముగ జేసి (2)
నిరతము నలరారెడు మా ప్రభువా (2)
చరణం 2:వేయితరముల వరకు సరిగా - విలసిల్లేటి వెలలేని మా
వింతల కృపాంబుధి యగు దేవా
యెంతయో నిను స్తుతియింతుము కోరిc
చరణం 3:నీ సత్య సంధత్వ మహిమ - నిరతము
నిలయం సంస్తుతులకు
మెరసెను నా మదిలోన దేవా
మరువగ లేమీ మధురప్రేమ
చరణం 4:ఎంతైనను నమ్మదగిన - వింతైన నీ విశ్వాస్యత
వాత్సల్యత వెలసెను మాపై
క్రొత్తగ ప్రతిదినము యేసుప్రభో
చరణం 5:మన ఆత్మను జీవము దేహమును - మన ప్రభు యేసు రాకడవరకు
ఒనరుగ కాపాడును పదిలముగా
దినదినమును నిందారహితముగ
చరణం 6:తండ్రి కుమార శుద్ధాత్మకును - తరతరములకు మహిమ ఘనత
పరిపూర్ణముగా ప్రబలును గాక
పరిపరి విధముల ప్రభు సంఘములో