CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 124

సాటి లేనిది యేసుని

saati lenidi yesuni

1 యోహాను 1 : 7 “ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి” మనలను పవిత్రులనుగా చేయును”

More
పల్లవి:సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగునుప్రియుడా పాపమును కడుగును
చరణం 1:చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించె యీ జగతిన్ ప్రియుడా ప్రేమించె యీ జగతిన్ సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను
చరణం 2:లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చె ప్రియుడా ప్రాణము బలిగానిచ్చె లోకపాపమెల్ల సిలువలో మోసి తొలగించె శాపమున్ ప్రియుడా తొలగించె శాపమున్
చరణం 3:వినుము సోదరా ప్రభుయేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించు చుంటిమి ప్రియుడా చాటించు చుంటిమి
చరణం 4:యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారలే కడుగును పాపమెల్ల ప్రియుడా కడుగును పాపమెల్ల
చరణం 5:పాపభారమును మోసికొని నీవు ప్రయాస మొందెదవా? ప్రియుడా ప్రయాస మొందెదవా? పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు జేరుము ప్రియుడా చెంతకు జేరుము
చరణం 6:గతించుచున్నది స్వల్ప జీవితం శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము
చరణం 7:కృపాయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకు