CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 125

సోదరుడా పాపక్షమకై

sodarudaa paapakshamakai

మార్కు 1 : 15 "మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి"

More
పల్లవి:సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని (2)
చరణం 1:యేసుని రాజ్యము - సమయము వచ్చెను (2) రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన (2)
చరణం 2:మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెను తనదు రక్తము ద్వారానే - పాపబంధము త్రుంచెను
చరణం 3:కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెను ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను
చరణం 4:సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమే సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము
చరణం 5:పాప సాగరమునందు ఎంతకాలముందువు? పాపసాగరము నుండి - యేసుప్రభు విడిపించును