CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 126

శ్రమలను పొందె శ్రీయేసుడు

shramalanu ponde shreeyesudu

యోహాను 19 : 17 "ఆయన తన సిలువ మోసికొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను”

More
పల్లవి:శ్రమలను పొందె శ్రీయేసుడు నీ కొరకై సిలువలో (2)
చరణం 1:సదయుడు ప్రేమించె - శత్రువైన నిన్ను దూరస్థుడవైన నీ యెడల - దయచూపించె (2) వహించె నీ శాపం భరించె నీ పాపం (2) నీ మనస్సు మార్చుకొనిన - సంతసించును ప్రభుయేసు (2)
చరణం 2:దొంగవై నీవున్నా - దురితంబులెన్నున్నా దోషంబుల క్షమియించు - తన సిలువ రక్తముతో తెరచెనుగా నీ కొరకు - పరలోక ద్వారము నెమ్మది నిచ్చును నీకు - యేసుని విశ్వసించిన
చరణం 3:ఎవరేసు రక్తములో - కడుగబడెదరో వారే చేరెదరు - తన సంఘము నందు అంగీకరించుము - యేసును నీవు కలిగించు నీకు తృప్తిని - నేడే నీ వాయనను వేడు
చరణం 4:సిలువపై యేసు - సర్వ మర్పించె నీ రక్షణ కొరకు - క్రయము చెల్లించె యేసునకు నీవు - ఏమియ్యగలవు? తెరువు నీ హృదయ ద్వారమును - నేడే ప్రవేశించును తాను