పల్లవి:రక్షింపనేరక యుండునట్లుప్రభుహస్తములు నీ కొరకై కురచ కాలేదుదినమెల్ల చాచి యుంచె తనదుగాయపడిన హస్తములు నీ కొరకే (2)
చరణం 1:నీ పాప దోషములచె నీవు దోషివై నీవుండగ (2)
దయగల యేసు దయ చూపి నీపై
నీ పాపము భరియించెను సిలువపై మరణించెను (2)
చరణం 2:తరుణములు ఇచ్చుచు తాను
నీ హృదయ ద్వారము తట్టుచుండె
తడవేల ఇంక తెరువు నీ హృదయము
క్రీస్తు ప్రవేశింపను నీ యందు వసియింపను
చరణం 3:మెల్లనైన స్వరము చేత తానె నిన్ను పిలచుచుండె
పెడచెవిని నీవు పెట్టెద వేల
ప్రభు పిలుపు ఆలకించు
యేసయ్యను స్వీకరించు