పల్లవి:జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును (2)స్వతంత్రించు కొనెదరుగ వారే సమస్తమున్ (2)
చరణం 1:ఎవరు యెదురుచూతురో సంసిద్ధులౌదురు (2)
ప్రభు రాక నెవరాశింతురో కొనిపోవ క్రీస్తు వచ్చును (2)
చరణం 2:యేసు శిష్యులతో పల్కె తిరిగి వత్తునని
సిద్ధపరతు స్థలమును నేనున్న చోట మీరుండ
చరణం 3:ఎవరేసునితో నడతురో ప్రత్యేకమవుదురు
మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును
చరణం 4:క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము
మమ్మును సిద్ధపరచిన శ్రీయేసును సంధింతుము
చరణం 5:తన సన్నిధిలో మనల నిలుపు నిర్దోషులనుగా
బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక యిదే
చరణం 6:సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము
అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా