పల్లవి:యవ్వనులారా మీరు బలవంతులుదైవ వాక్యము మీలో నిలచియున్నది - (2)దుష్టుని మీరు జయించియున్నారు-దేవుడే మీ పక్షముగా యుద్ధమాడెను - (2)
చరణం 1:దేవుని మూలముగా జన్మించిన పుత్రులుగా
అపవాది నుండి మిమ్మును తప్పించును
నడిపించును ఆత్మీయ ప్రజలనుగా -(2)
అంతము వరకు మిమ్మును క్షేమముగా - (2)
చరణం 2:దైవశక్తిచే స్థిరులుగ నిలవబడి
శత్రు సాతానుని మీరు యెదురించుడి
దేవుడిచ్చు సర్వాంగ కవచమును
ధరించి మీరు ధీరులై పోరాడుడి
చరణం 3:సజీవుడైన యేసుడే మీతో నుండున్
సాతానుని జయించే శక్తిని ఇచ్చున్
పూర్ణబలముతో మిమ్మును బలపరచున్
విజయశాలియై మీకు విజయమిచ్చున్
చరణం 4:ప్రభుయేసు క్రీస్తు మీ పక్షముగా
ఉండగా మీకు విరోధి ఎవ్వడు
ఆయన ద్వారానే అత్యధిక విజయము
పొందుచు మీరు చేరుడి నిత్యరాజ్య
చరణం 5:మంచి పోరాటము పోరాడుచు
విశ్వాసమందు మీరు నిలచియుండుడి
అంతము వరకు స్థిరులుగా నిలచుండిన
నిత్యమందు బహుమానమును పొందెదరు