పల్లవి:ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము (1)ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది (2)
చరణం 1:అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి (2)
ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2)
చరణం 2:సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీద అని నేను మొర పెట్టగా
వింటినంటివి నా మొరకు ముందె తోడనుందునంటివి
చరణం 3:మరణాంధ కారంపు లోయ నే సంచరించిన
నిరంతర మేసు నాదు కాపరియై
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు
చరణం 4:కొదువలెన్ని యున్న భయపడను నేనెపుడు
పచ్చికబయలులో పరుండజేయును
భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు
చరణం 5:దేవుని గృహములో సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయ ఆమెన్