పల్లవి:అసమానుండగు ఓ క్రీస్తు - అద్వితీయుండగు దేవా (1)అల్పాయు ఓ మేగ (2) నీవే ప్రభువా (2)
చరణం 1:ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె (2)
అభయము నిచ్చి మాకు - భయభీతిని బాపితివి (2)
భయభీతిని బాపితివి (2)
చరణం 2:నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికి
పావనుడా ప్రభుయేసు - అవనికి మాదిరి నీవే
చరణం 3:మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే
సాతానున్ ఓడించి నీతిగా మము తీర్చితివి
చరణం 4:పాపశాపముల బాపితివే - చూపితివే పరమదారి
శక్తిగల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు
చరణం 5:విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమ
జ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ
చరణం 6:సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి
సర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే