CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 47

నీ వాత్మ యుద్ధములో జయ మొందుము

nee vaatma yuddhamulo jaya mondumu

2 తిమోతి 2:3 “క్రీస్తు యొక్క మంచి రాణువ వానివలె నాతోకూడ శ్రమను అనుభవించుము”

More
పల్లవి:నీ వాత్మ యుద్ధములో జయ మొందుము (2)ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1)
చరణం 1:స్వామి యేసు తన సిలువను మోసి - సైతాను రాజ్యము పూర్తిగా జయించె (2) నీవును యేసుని వెంబడి వెళ్ళుమా (2) ఓ నా సోదరా వెనుకంజ వేయకు (1) ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1)
చరణం 2:శిరమున ముండ్ల మకుటము ధరించి - సిపాయిచే తలపై కొట్టబడె నీ శిరస్సు నట్లే సమర్పించు ఓ నా సోదరా వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు
చరణం 3:కల్వరిపైకి - ఒంటరిగానే - వెళ్ళెను యేసు - త్యాగ సహితుడై నీవును ఆ దారినే వెళ్లుమా ఓ నా సోదరా వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు
చరణం 4:లోకస్తులంతా - నిద్రించుచుండగా - మోకాళ్ళపై యేసు - కొండపై నుండె నీవును ప్రార్థన శక్తి నొందుమా ఓ నా సోదరా వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు
చరణం 5:సాహసమున నీ వాత్మ ఖడ్గమున - సైతాను బంధము - ఖండించివేసి క్రీస్తుని సంఘమా - ముందంజ వేయుమా ఓ నా సోదరా వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు