పల్లవి:ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ - అల్ఫయు నీవే - ఓమేగయు నీవే (2)
చరణం 1:ప్రియుడైన యోహాను - పత్మాసులో - ప్రియమైన యేసూ - నీ స్వరూపము (2)
ప్రియమార జూచి - బహుధన్యుడయ్యె
ప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము (2)
చరణం 2:లెక్కలేని మార్లు - పడిపోతిని -దిక్కులేనివాడ- నే నైతిని
చక్కజేసి నా - నేత్రాలు దెరచి
గ్రక్కున - నిన్ను జూడనిమ్ము
చరణం 3:ఎఱిగి యెఱిగి నే - చెడిపోతిని-యేసు నీ గాయము - రేపితిని
మోసపోతి నేను - దృష్టి దొలగితి
దాసుడ నన్ను - జూడనిమ్ము
చరణం 4:ఎందరేసుని వైపు - చూచెదరో - పొందెదరు వెల్గు - ముఖమున
సందియంబు లేక - సంతోషించుచు
ముందుకు - పరుగెత్తెదరు
చరణం 5:విశ్వాసకర్తా - ఓ యేసు ప్రభూ - కొనసాగించువాడా- యేసు ప్రభూ
వినయముతో నేను - నీ వైపు జూచుచు
విసుగక - పరుగెత్త నేర్పు
చరణం 6:కంటికి కనబడని - వెన్నియో-చెవికి వినబడని - వెన్నియో
హృదయ గోచరము - కాని వెన్నియో
సిద్ధపరచితివా - నాకై?
చరణం 7:లోక భోగాలపై - నా నేత్రాలు - సోకకుండునట్లు - కృపజూపుము
నీ మహిమ దివ్య - స్వరూపమును
నిండార నను - జూడనిమ్ము