పల్లవి:ఓ సర్వశక్తుడా - నా సత్యదేవుడా, సర్వదా నిను నే స్మరియింతును (2)
చరణం 1:చెర నుండి నేను - మొరపెట్టగా (2)
పరము నుండి - ఉత్తరమిచ్చెను(2)
చరణం 2:గాఢమైన - సంగతులన్
గ్రహించునట్లు - ప్రభుచేయును
చరణం 3:అడుగువాటికన్న - ప్రభువు
అత్యధికముగా - దయచేయును
చరణం 4:ఊహకు మించిన - కార్యములన్
మహాప్రభు నడిగిన - నెరవేర్చును
చరణం 5:వేడుకొనక - మునుపే ప్రభు
వడిగా మాకు - త్తరమిచ్చును
చరణం 6:మునుపటి కన్న - అధికముగా
మేలుల మాకు - కలుగజేయున్
చరణం 7:ప్రార్ధనకు - ప్రతిఫలముల్
ప్రియముగ నొసగును- హల్లెలూయ