CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 6

యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు

yesoo nan preminchitivi - aashrayamu lenappudu

లూకా 7:13 “ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడెను”

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు            నీ శరణు వేడగానే - నా పాపభారము తొలగె (1)
చరణం 1:నేను దూరమైతి నీకు - నశియించితి లోకమున (2) నేను గ్రహించలేదు - నీ హృదయ ప్రేమను (1)
చరణం 2:నేను తలచలేదెప్పుడు - నా అంత మేమవునని నా పాపములచే నేను - నిన్ను విసిగించితిని
చరణం 3:నిన్ను నేగాంచగానే - నా జీవితము మారెను నేనెంతో గ్రుచ్చబడి - నిన్నంగీకరించితి
చరణం 4:రక్షణ దొరికె నాకు - రక్తముతో నన్ను కడిగి రయముగా నీ చెంతకు - రక్షకా తెచ్చితివి
చరణం 5:పరిశుద్ధులలో చేర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చి పూర్ణాధికారము నిచ్చి - పరలోకము తెరచితివి