CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 7

స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము

stuti prashansa paaduchu keertintu nityamu

కీర్తనలు 66:16 "దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను"

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (1)మహారక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను (2)
చరణం 1:పాపలోక బంధమందు దాసత్వమందుండ (2) నీ రక్త శక్తిచే ప్రభు విమోచించితివి (2)
చరణం 2:పాప భారముచే నేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖబాధలు
చరణం 3:హృదయాంధకారముచే నేను దారి తొలగితి ప్రభువే జ్యోతి యాయెను సత్య మార్గము జూపె
చరణం 4:పెంటకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి దరిద్రుడనైన నన్ను రాజుగ జేసితివి