CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 71

మీరు బహుగా ఫలించినచో

meeru bahugaa phalinchinacho

యోహాను 15 : 8 "మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు"

More
పల్లవి:మీరు బహుగా ఫలించినచో -  మహిమ కలుగును తండ్రికి (1)ఈ రీతిగా ఫలించినచో శిష్యులై యుండెదరు (2)
చరణం 1:నీరు కట్టిన తోటవలె- నీటి వూటవలె నుండెదరు (2) క్షామములో తృప్తినిచ్చి - క్షేమముగా మిమ్ము నడిపించును (2) బలపరచును మీ యెముకలను (2) అధికముగా ఫలించుడి (2)
చరణం 2:చెట్లు లేని మెట్టలలో - నదుల ప్రవహింపజేయు ప్రభువు ఎండియున్న నేలనెల్ల - నీటి బుగ్గలుగా జేయువాడు మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి
చరణం 3:వడిగా ప్రవహించు నదిని బోలి - విస్తరింపజేయు తన శాంతిని ఐశ్వర్యముతో నింపు మిమ్ము - ముదిమి వరకు మిమ్ము మోయువాడు మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి
చరణం 4:పాడెదరు మూగవారు - గంతులు వేసెదరు కుంటివారు పొగడెదరు ప్రజలెల్లరు - ప్రభుని ఆశ్చర్యకార్యములను మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయ పాడెదరు