పల్లవి:సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు (2)మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజు కొఱకే (2)
చరణం 1:లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరని (2)
తన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగా (2)
క్రీస్తే మన రారాజని ఉత్సహించెదము (2)
చరణం 2:వాహనములు ఎన్ని యున్న గార్దభమును యెక్కెను
తానెవరియింట నుండునో వారిని యుద్ధరించును
పరీక్షించ ఆయనను చేర్చుకో నీ యందు
చరణం 3:యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతో
తృణీకరించువారలు నశింతురు నిక్కంబుగ
ప్రాముఖ్యమౌ ప్రశ్న యిది యోచించి చూచుకో
చరణం 4:రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే
న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు
సదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి