పల్లవి:సోదరులారా లెండి - రాకడ గుర్తులు చూడండి (1)దివిటీల నూనెతో నింపి - సిద్ధపడండి (2)
చరణం 1:అర్ధరాత్రి వేళలో - ప్రభురాకడ ధ్వనిమ్రోగెను (2)
సోమరితనము విడచి – (2 సార్లు)
నడుమున దట్టి గట్టి - ప్రభుని కెదురు చూడుము (2)
చరణం 2:సర్వత్ర యుద్ధాలు భూకం -పములును ఘోరవ్యాధులు
ఘోరముగ ప్రబలెను - (2)
యేసుని రాకడ సమీపం - బాయెనో సోదరా
చరణం 3:రాజ్యాలు అధికారాలన్ని - కదలిపోవుచున్నవి
కలవరమధికంబాయె (2)
కన్నులు తెరిచి చూడుమా ప్రభు వచ్చె వేళాయె
చరణం 4:చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే యొక సూచన
క్రీస్తు యుగ మారంభము (2 సార్లు)
రానైయున్న వేళిదే - కని పెట్టుము సోదరా
చరణం 5:తలుపు వేయబడిన లోన - ప్రవేశించనేరవు
పశ్చాత్తాప పడుము (2)
యేసుపై నాధారపడి సంసిద్ధపడుమా