CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 79

రాజాధిరాజా రావే - రాజు

raajaadhiraajaa raave - raaju

ప్రకటన 22 : 20 "అమెన్ ; ప్రభువైన యేసూ, రమ్ము "

More
పల్లవి:రాజాధిరాజా రావే - రాజు యేసు రాజ్యమేల రావే (1) రాజులకు రాజువై రావే - రవికోటి తేజ యేసు రావే (2)ఓ......... మేఘ వాహనంబు మీద వేగమేఓ........ మించు వైభవంబుతోడ వేగమే (2)
చరణం 1:ఓ...... భూజనంబులెల్ల తేరి చూడగా ఓ....... నీ జనంబు స్వాగతంబు నీయగా (2) నీ రాజ్య స్థాపనంబు చేయ-భూరాజులెల్ల గూలిపోవ (1) భూమియాకాసంబు మారిపోవ- నీ మహా ప్రభావమున వేగ (2)
చరణం 2:ఆ....... ఆకసమున దూతలార్భటింపగా ఆ....... అది భక్త సంఘ సమేతంబుగా ఆకసంబు మధ్యవీధిలోన - ఏకమై మహాసభచేయ లోకనాథ ! నీదు మహిమలోన మాకదే- మహానందమౌగా
చరణం 3:ఓ....... పరమ యెరూషలేము పుణ్య సంఘమా! ఓ.........గొఱ్ఱెపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా ! పరమదూతలారా! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా! గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్త గీతమెత్తి పాడరారా