CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 92

సంఘమే - పరిశుద్ధ సంఘమే

sanghame - parishuddha sanghame

1 కొరింధీ 12:24, 25: రోమా 12:5 "ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము."

More
పల్లవి:సంఘమే - పరిశుద్ధ సంఘమే - సార్వత్రిక - సంపూర్ణ సంఘమే (2)
చరణం 1:దేవుడే - మన తండ్రి - క్రీస్తు ప్రభువే - మన శిరస్సు (2) తన రక్తములో - కడుగబడిన సంఘములో - అంగము నీవు, నేనే (2)
చరణం 2:కాళ్ళు, చేతుల - పని వేరు - కళ్లు, నోటి - పని వేరు అయిననూ - ఒకే శరీరము - అందరు సమము-అమూల్యము
చరణం 3:అపొస్తలులు - పెద్దలు - సువార్తికులు- పరిచారకులు సంఘక్షేమాభి - వృద్ధికై - మన ప్రభువే - నియమించెను
చరణం 4:మోషే - దేవుని సేవకుడు- దానియేల్ - ప్రియ సేవకుడు దేవుడే - కనుగొనెను - నిజదాసుని కిచ్చును బహుమానము
చరణం 5:కొంచెములో - నమ్మకముగా నుంటివని -దేవుడే నిన్ను - పొగడును భళా ! మంచి - నమ్మకమైన - దాసుడంచు - కిరీటమిచ్చున్